Friday, February 12, 2016

గుండు మధుసూధన్ గారి పద్య పూరణాలు 201 నుండి

గుండు మధుసూదన్ గారి పద్య పూరణాలు 201 నుండి


అయుత కవితా యజ్ఞము
Sk-167
గుండు మధుసూదన్
వరంగల్

తేది: 03-02-2016
కవిత సంఖ్య: 201

శీర్షిక:-  జోతలు!

రథోద్ధత వృత్తము:
నీలకంఠ! హర! ♦ నృత్య వల్లభా!
బాలచంద్రధర! ♦ భస్మమండనా!
శైలజా వర! వి♦శాల మానసా!
ఫాలలోచన! సు♦వక్త్ర! సన్నుతుల్!

-:శుభం భూయాత్:-
******************
గుండు మధుసూదన్
వరంగల్
అయుత కవితా యజ్ఞము
Sk-167
గుండు మధుసూదన్
వరంగల్

తేది: 03-02-2016
కవిత సంఖ్య: 203

శీర్షిక:-  అభిమన్యుఁడు!

తే.గీ.
చూడఁగను నా సుభద్రాత్మ♦జుండు పోర
గెలువఁగాను పద్మవ్యూహ ♦ మెలమిఁ జొచ్చి,
కురుమహావీరులనుఁ జీల్చి, ♦ కూలెఁ దుదకు!
బిడ్డఁడా వాఁడు? రణరంగ♦భీకరుండు!

-:శుభం భూయాత్:-
******************
గుండు మధుసూదన్
వరంగల్
అయుత కవితా యజ్ఞము
Sk-167
గుండు మధుసూదన్
వరంగల్

తేది: 03-02-2016
కవిత సంఖ్య: 204

శీర్షిక:-  భానుని శోకము!

సమస్య:-
వార్ధిలో మున్గె భానుఁడు పగటివేళ!


కన్నడ బ్లాగు ‘పద్యపాన’ సౌజన్యమున...

(ಅಬ್ಧಿಯೊಳು ಮುಳುಗಿದನು ಭಾಸ್ಕರನುರಿವಬಿಸಿಲಿನೊಳ)

అను సమస్యకు తెలుఁగులో నేనుఁ జేసిన పూరణము

తే.గీ.
తనదు వరపుత్రకుండును ♦ దానగుణుఁడు
స్నేహశీలుండు, కర్ణుండు ♦ నాహవమున
నర్జునుని చేత హతమొంది♦నపుడు శోక
వార్ధిలో మున్గె భానుఁడు ♦ పగటివేళ!

-:శుభం భూయాత్:-
******************
గుండు మధుసూదన్
వరంగల్
అయుత కవితా యజ్ఞము
Sk-167
గుండు మధుసూదన్
వరంగల్

తేది: 03-02-2016
కవిత సంఖ్య: 205

శీర్షిక:-  రామదాసు!

కం.
కారాగారమె గోప
న్నా! రామ సుగుణ విశేష ♦ నామ జపముచే
నారామమయ్యెఁ గాదా!
ధీరా! దాశరథి శతక ♦ దివ్య కృతీశా!

-:శుభం భూయాత్:-
******************
గుండు మధుసూదన్
వరంగల్
అయుత కవితా యజ్ఞము
Sk-167
గుండు మధుసూదన్
వరంగల్

తేది: 03-02-2016
కవిత సంఖ్య: 206

శీర్షిక:-  చెఱలో...నెహ్రూ!

కం.
కారాగారస్థుఁడు నె
హ్రూ రచియించె నఁటఁ బెక్కు♦లుగఁ బుస్తకముల్!
కారాగార మనంగ న
పారమయిన బుద్ధికుశల ♦ వర్ధిత గృహమే!!

-:శుభం భూయాత్:-
******************
గుండు మధుసూదన్
వరంగల్
అయుత కవితా యజ్ఞము
Sk-167
గుండు మధుసూదన్
వరంగల్

తేది: 03-02-2016
కవిత సంఖ్య: 207

శీర్షిక:-  కరివేఁపాకు...!

తే,గీ.
సకల శాకములందునఁ ♦ జాల రుచినిఁ
గలుగఁ జేయును కరివేఁప ♦ ఘనముగాను!
కాని, కూర నుండియు నేఱి, ♦ దానిని మన
మేఱి వైతుము, దుష్టుల ♦ నేఱినట్లు!!

-:శుభం భూయాత్:-
******************
గుండు మధుసూదన్
వరంగల్
అయుత కవితా యజ్ఞము
Sk-167
గుండు మధుసూదన్
వరంగల్

తేది: 03-02-2016
కవిత సంఖ్య: 209

శీర్షిక:-  వనమయూరము (ముద్రాలంకారమున)

వనమయూర వృత్తము:
ఓ కవియఁగన్, వనమ♦యూరము కలాపిన్,
గోక పురివిప్పి, జతఁ♦గోరి, మనువాడన్,
గేకిసలు గొట్టుచును ♦ కేకి నిఁటఁ గూడన్,
లోకమున వర్షములు ♦ లోలతనుఁ జూపెన్!
(ఓ = మేఘము)

వృత్త వివరణము:
వనమయూర వృత్తమున...భ-జ-స-న-గగ..గణములుండును
1-9 యక్షరములు యతిమైత్రినిం గలిగియుండును
వృత్తమును వ్రాయుటకు
భల-భల-భల-గగ...లుండునట్లుగ వ్రాసిన
సులభతరమగును!

ముద్రాలంకార మనఁగ నా పద్యమందు నా పద్యము పేరు వచ్చునట్లు రచించుట.
స్వస్తి.

-:శుభం భూయాత్:-
******************
గుండు మధుసూదన్
వరంగల్
అయుత కవితా యజ్ఞము
Sk-167
గుండు మధుసూదన్
వరంగల్

తేది: 03-02-2016
కవిత సంఖ్య: 210

శీర్షిక:-  హితైషులు!

సమస్య:-
దుర్వినయంబునన్ మనసు దోచెడివారు హితైషులే కదా!

ఉత్పలమాల:
శర్వుని గొల్చుచున్, సతత ♦ సత్య మహింస మనమ్ముఁ బూనియున్,
గర్వ మొకింత లేక, మమ♦కారముఁ జూపుచుఁ, గీర్త్యనిష్టులై,
సర్వ విశిష్ట మూర్తి యుత ♦ సత్పరివర్తన ’నేరు’ పూనియుం
దు ర్వినయంబునన్, మనసు ♦ దోచెడి ’వారు’, "హితైషులే" కదా!

-:శుభం భూయాత్:-
******************
గుండు మధుసూదన్
వరంగల్
అయుత కవితా యజ్ఞము
Sk-167
గుండు మధుసూదన్
వరంగల్

తేది: 05-02-2016

శీర్షిక:- పొగత్రాగువాఁడు....?

కవిత సంఖ్య: 211

కం.
"పొగత్రాగినఁ జెడిపోదు" వ
నఁగ నింకయుఁ ద్రాగి త్రాగి ♦ నరకమునఁ బడన్
నెగడుచు నటులే మఱిమఱి
పొగత్రాగెడువాఁడు దున్న♦పోతై పుట్టున్!!

-:శుభం భూయాత్:-
******************

సుకవి జన విధేయుఁడు
గుండు మధుసూదన్
వరంగల్
అయుత కవితా యజ్ఞము
Sk-167
గుండు మధుసూదన్
వరంగల్

తేది: 05-02-2016
కవిత సంఖ్య: 212

శీర్షిక:-  నీటి యెద్దడి పోవలెనన్న...!

ఉత్పలమాల (సప్తపాది):
త్రాగుదమన్న నీరమెది? ♦ దాహము తీరదు! నీటికోసమై
ప్రోగుపడంగ సర్వులకుఁ ♦ బోవునె దుఃఖము? నీరు తోడఁగా
వేగిర మంద నీరమును ♦ బిందెయు నింపదు! మంటిలోపలన్
బాగుగ నీర మెద్ది? ఘన♦వర్షము లొక్కట రాక ముందఱన్
వాగులు వంకలన్ మిగుల ♦ బాగొనరించియు వేగ పూడికల్
త్యాగయుతాత్ములై పఱఁగఁ ♦ ద్రవ్వియుఁ దీసియు సాగుచేయఁగా,
వేగమె నీర మంత నిడుఁ ♦ బ్రీతిగ వాపి తటాకముల్ సదా!

-:శుభం భూయాత్:-
******************

సుకవి జన విధేయుఁడు
గుండు మధుసూదన్
వరంగల్
అయుత కవితా యజ్ఞము
Sk-167
గుండు మధుసూదన్
వరంగల్

తేది: 05-02-2016
కవిత సంఖ్య: 213

శీర్షిక:-  అమ్మా...అమ్మా...అమ్మా...!

[ఇరాక్ లోని ఒక అనాథాశ్రమంలో అమ్మా నాన్నలు లేని ఒక అమ్మాయి తన అమ్మ బొమ్మను గీసుకొని తన అమ్మ ఒడిలో నిద్రిస్తున్నట్టుగా భావిస్తూ పడుకుంది. అమ్మ ప్రేమకు దూరమైన ఈ చిన్నారి బాధను వర్ణించ తరమా..?]

తే.గీ.
"అమ్మ నాకేది? కల దమ్మ ♦ అందఱికిని!
అమ్మ యెక్కడ నుంటివో, ♦ ఆదుకొమ్మ!
ఆకలిని దీర్చి,యెదకును ♦ హత్తుకొనఁగ,
అమ్మ, రావేల? ఒడిఁజేర♦నిమ్మ! రమ్మ!"

-:శుభం భూయాత్:-
******************

సుకవి జన విధేయుఁడు
గుండు మధుసూదన్
వరంగల్
అయుత కవితా యజ్ఞము
Sk-167
గుండు మధుసూదన్
వరంగల్

తేది: 05-02-2016
కవిత సంఖ్య: 214

శీర్షిక:-  ముదితల వస్త్ర ధారణము!

చంపకమాల:
చలిత విశాల నేత్ర యుత ♦ శర్వరు లొక్కెడ వస్త్ర కోటులన్
సులలిత రీతిఁ దాల్చి, మన ♦ సోదర రాష్ట్ర విశేష భంగిమల్
పలువుఱ మెప్పు లందఁగను, ♦ భారత సంస్కృతి గొప్పఁ జాటుచున్
వలపులఁ జూపుచుండిరిట, ♦ భారతమాత మనమ్ము గెల్వఁగన్!

-:శుభం భూయాత్:-
******************

సుకవి జన విధేయుఁడు
గుండు మధుసూదన్
వరంగల్
అయుత కవితా యజ్ఞము
Sk-167
గుండు మధుసూదన్
వరంగల్

తేది: 05-02-2016
కవిత సంఖ్య: 215

శీర్షిక:-  భార్యాభర్తలు!

తే.గీ.
సరవిఁ దప్పక సంసార ♦ చక్రమందుఁ
దిరుగలికి వలె దంపతుల్ ♦ దీక్షనుంద్రు!
తిరుగుచును భర్త జీవికఁ ♦ దెచ్చుచుండు;
తిరముగా భార్య యింటినిఁ ♦ దీర్చి దిద్దు!!

-:శుభం భూయాత్:-
******************

సుకవి జన విధేయుఁడు
గుండు మధుసూదన్
వరంగల్
అయుత కవితా యజ్ఞము
Sk-167
గుండు మధుసూదన్
వరంగల్

తేది: 05-02-2016
కవిత సంఖ్య: 216

శీర్షిక:-  లోభి సంపద...!

ఆ.వె.
తాను దినక, పరుల♦కైననుఁ బెట్టక,
కూడఁబెట్టి; నిదురఁ ♦ గూడఁ బోక,
రే వగళ్ళుఁ గాచి, ♦ ప్రియమారఁ గాంచెడు
లోభి ధనము, మూఁడు ♦ లాభములకె!

[మూఁడు లాభములు=దొంగలపాలు, రాజులపాలు, భూమిపాలు]

-:శుభం భూయాత్:-
******************

సుకవి జన విధేయుఁడు
గుండు మధుసూదన్
వరంగల్
అయుత కవితా యజ్ఞము
Sk-167
గుండు మధుసూదన్
వరంగల్

తేది: 05-02-2016
కవిత సంఖ్య: 217

శీర్షిక:-  కర్ణుని చావునకు కారణములు...!

తేటగీతి(షట్పాది):
భార్గవ ద్విజ పృథ్వి శా♦పాల కతన;
సహజ కవచ కుండలములు ♦ శక్రుఁడుఁ గొన;
శల్య సారథ్య మతని యు♦త్సాహ ముడుపఁ
గర్ణుఁ జావుక వెన్నియో ♦ కారణములు!
కాని, పార్థుఁడే సంపెను ♦ కర్ణు నంచు
నప్రతిష్ఠను మోసె నా ♦ యర్జునుండు!!

-:శుభం భూయాత్:-
******************

సుకవి జన విధేయుఁడు
గుండు మధుసూదన్
వరంగల్
అయుత కవితా యజ్ఞము
Sk-167
గుండు మధుసూదన్
వరంగల్

తేది: 05-02-2016
కవిత సంఖ్య: 218

శీర్షిక:-  నవ్వుల ఱేఁడు...రేలంగి!

కం.
రేలంగి హాస్య నటునిగఁ
బాలించెను జలనచిత్ర ♦ వనిలోనను! దా
నేలిన పాత్రలు పద్మ
శ్రీ లభియింపంగఁ జేసెఁ ♦ జిత్రములందున్!(1)

సీ.
బాల్యమ్ములోఁ దండ్రి ♦ పలికించె 'హరికథల్'
.....'సంగీత' మింపారె ♦ సరస భంగి!
మొదట 'నాటక రంగ'♦మునను 'బృహన్నల'
.....లోన స్త్రీ పాత్రలోఁ ♦ దా నటించె!
'కృష్ణ తులాభార' ♦ కీర్తితుఁడై తాను
.....'జలన చిత్రాల'లో ♦ నెల కొనియెను!
'గుణ సుందరి కథ'లో ♦ గుణము హెచ్చఁగఁ బ్రజల్
.....'హాస్య నటుని'గా ♦ సమాదరింప;
గీ.
స్థిరత నందియు రేలంగి ♦ తీరు మాఱె!
నాయకుని సరసను దా స♦హాయ నటుని
పాత్ర లెన్నియొ పోషించి, ♦ ప్రజల మెప్పు
వడసి, తానెంతొ వెలిఁగిపో♦వఁగ మొదలిడె!(2)

సీ.
విప్ర నారాయణ, ♦ వెలుఁగు నీడలు, దొంగ
.....రాముఁడు, మిస్సమ్మ, ♦ లవకుశలను;
సత్య హరిశ్చంద్ర, ♦ జగదేక వీరుఁడు,
.....మాయా బజారులన్ ♦ మంచి హాస్య
నటనను బోషించి♦నట్టి రేలంగి తా
.....నెంతయో యెదిగెను ♦ వింతగాను!
ప్రేక్షకాళిని హాస్య♦రీతుల మెప్పించి,
.....చిత్ర పరిశ్రమన్ ♦ జిర యశుఁడయి,
గీ.
నిలిచి, వెలిఁగెను నాతండు! ♦ నేఁటి కింక
నతని చిత్రాలు చూచెద ♦ ననెడి వార
లెందఱో కలరన వింత ♦ యేమి కాదు!
తర తరమ్ము లప్రతిముఁడై ♦ తనరె నతఁడు!!(3)

ఆ.వె.
ప్రియ తముండునైన ♦ 'రేలంగి' మాటాడ
నవ్వు పువ్వు ఱువ్వు, ♦ ఱివ్వుమనఁగ!
విరియు నెడఁద మనకు ♦ 'వేంకట రామయ్య'
పలుకు వినఁగ! నతఁడు ♦ వర యుతుండు!!(4)

కం.
నవ్వుల ఱేఁ డతఁ డెప్పుడు
ఱువ్వు ఛలోక్తులును హాస్య ♦ రుచు లందించున్!
దివ్వియ వలె వెలుఁగు నతం
డివ్విధి జన హృదయ వీథిఁ ♦ దిరమై భువిలోన్!!(5)

-:శుభం భూయాత్:-
******************

సుకవి జన విధేయుఁడు
గుండు మధుసూదన్
వరంగల్
అయుత కవితా యజ్ఞము
Sk-167
గుండు మధుసూదన్
వరంగల్

తేది: 05-02-2016
కవిత సంఖ్య: 219

శీర్షిక:-  పరనింద!

కం.
పరనింద సేయఁ గడఁగిన
నరునకుఁ బర శాపజనిత ♦ నాశము గల్గున్!
ధరణి నిది జరుగుఁ దథ్యము;
పరులగు దీనులకు సేవ ♦ పాపము లడఁచున్!!

-:శుభం భూయాత్:-
******************

సుకవి జన విధేయుఁడు
గుండు మధుసూదన్
వరంగల్

No comments:

Post a Comment